ధరణి కార్యక్రమం ప్రారంభం రెవెన్యూశాఖ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం తెలిపారు. భూపాలపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ను ప్రారంభించారు. రైతులు దళారుల ప్రమేయం లేకుండా నేరుగా వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ధరణి కార్యక్రమం గొప్ప అవకాశమన్నారు.
'రెవెన్యూశాఖ చరిత్రలో ధరణి ఒక సువర్ణ అధ్యాయం' - ధరణి పోర్టల్ వార్తలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ను కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం ప్రారంభించారు. రైతులు దళారుల ప్రమేయం లేకుండా నేరుగా వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ధరణి కార్యక్రమం గొప్ప అవకాశమన్నారు.
రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా ప్రారంభమైన ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ పారదర్శకంగా జరుగుతుందని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చేసుకునే వారు నేరుగా ధరణి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే... తహసీల్దార్, జాయింట్ సబ్ రిజిస్టార్ ఆ దరఖాస్తులను పరిశీలించి రిజిస్ట్రేషన్ చేస్తారని తెలిపారు.
రైతులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో కలెక్టర్ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ అశోక్ కుమార్, ఈ- డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీకాంత్, డిప్యూటీ తహసీల్దార్ రవీందర్, ఆర్ఐ దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.