దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పూజా కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ప్రజల శ్రేయస్సు కోసమే పూజలు: ఎమ్మెల్యే గండ్ర - జయశంకర్ భూపాలపల్లి తాజా సమాచారం
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ దంపతులు హోమం నిర్వహించారు. ప్రజలందరు సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రజల శ్రేయస్సు కోసమే పూజలు: ఎమ్మెల్యే గండ్ర
ప్రజలందరి మేలు కోసం కుంకుమపూజ హోమం, లలిత సహస్రనామపారాయణం నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.