తెలంగాణ

telangana

ETV Bharat / state

కాళేశ్వర ఆలయంలో రేపటి నుంచి దర్శనాల నిలిపివేత

కాళేశ్వరంలోని శ్రీ ముక్తీశ్వర స్వామి ఆలయంలో దర్శనాలను రేపటి నుంచి నిలిపివేయనున్నారు. వచ్చే నెల 5 వరకు భక్తులను అనుమతించకూడదని నిర్ణయించినట్లు ఈవో తెలిపారు. స్వామికి అర్చకుల సమక్షంలోనే ఉదయం, సాయంత్రం వేళల్లో పూజలు చేస్తారని వెల్లడించారు.

By

Published : Apr 27, 2021, 8:37 AM IST

Darshans at Srikaleshwara, corona effect on temples
ఆలయంపై కరోనా ఎఫెక్ట్, కాళేశ్వర ఆలయంలో దర్శనాలు నిలిపివేత

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని శ్రీముక్తీశ్వర స్వామి ఆలయంలో దర్శనాలను నిలిపివేయనున్నారు. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నందున ఈ నెల 28 నుంచి వచ్చే నెల 5వరకు నిలిపివేయాలని నిర్ణయించారు. దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వామికి నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో అర్చకుల సమక్షంలోనే పూజలు నిర్వహించనున్నట్లు ఈవో మారుతి తెలిపారు.

ఆలయంలో ఇప్పటికే ఇద్దరు సిబ్బంది, ఒక అర్చుకుడు కరోనా బారిన పడ్డారు. గ్రామంలో 50కి పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్ నుంచి భక్తులు ఎక్కువగా వస్తున్నందున... ఆలయంలోకి భక్తులకు అనుమతించవద్దని నిర్ణయించినట్లు ఈవో వెల్లడించారు.

ఇదీ చదవండి:పది రెట్లు ధర పెంచి కరోనా మందుల అమ్మకం..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details