cwc visited kaleshwaram: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి నదీ యాజమాన్య బోర్డు, సీడబ్ల్యూసీ బృందం పర్యటించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు గోదావరి నీటి లభ్యతను పరిశీలించింది. సీడబ్ల్యూసీ సీఈ ఎ.కుమార్‌నాయక్, ఎస్ఈ ఎం.రఘురాం, ఈఈ ఎన్.శ్రీనివాస్‌రావు, కాళేశ్వరం ప్రాజెక్టు రామగుండం సర్కిల్ ఈఎన్సీఈ నల్ల వెంకటేశ్వర్లతో కలిసి పరిశీలన చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, కన్నెపల్లి పంప్ హౌస్ నిర్మాణాలను సందర్శించారు. ప్రాజెక్టుకు గోదావరి ప్రవాహం ఎంత మేర వస్తుంది, నీటి లభ్యత, నీటి నిల్వ తదితర అంశాలపై వివరాలు సేకరించారు.
cwc visited kaleshwaram: కాళేశ్వరం నీటి లభ్యతపై క్షేత్రస్థాయి పర్యటన
కాళేశ్వరం ప్రాజెక్టుకు గోదావరి ప్రవాహం ఎంత మేర వస్తుంది, నీటి లభ్యత, నీటి నిల్వ తదితర అంశాలపై గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీ వివరాలు సేకరించింది. నీటి లభ్యతను పరిశీలించింది.
cwc visited kaleshwaram
అదే విధంగా మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల పనితీరును ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్ విభాగం అధికారులు బుధవారం పరిశీలించారు. ఆ విభాగం ఈఎన్సీఈ నాగేంద్రరావు నేతృత్వంలో ఇంజినీరింగ్ అధికారుల బృందం సందర్శించింది. బ్యారేజీల్లో నీటి నిల్వ, గేట్లు తెరవడంలో ఇబ్బందులు, లోపాలు, తదితర అంశాలను వారు పరిశీలించారు.
ఇదీచూడండి:అన్నదాత దైన్యం... వడ్లు కొనమని అధికారి కాళ్లు మొక్కిన వైనం