తెలంగాణ

telangana

ETV Bharat / state

లాభాలకు 'బంతి' పూల బాట - బంతి పూలు

సంప్రదాయ పంటలు సాగు చేస్తూ నష్టాల ఊబిలో చిక్కుకున్న రైతులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. అప్పుల పాలు కాకుండా ఉండేందుకు పంట మార్పిడి చేస్తూ బంతి పూల సాగుచేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధిస్తూ లాభాలు గడిస్తున్న బంతి సాగు రైతులపై "ఈటీవీ భారత్"​ ప్రత్యేక కథనం...

లాభాలకు 'బంతి' పూల బాట

By

Published : Nov 12, 2019, 4:34 PM IST

లాభాలకు 'బంతి' పూల బాట

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నారాయణపూర్, కొత్తపల్లి గ్రామాల రైతులు బంతి సాగుతో లాభాలు గడిస్తున్నారు. పత్తి, మొక్కజొన్న, మిర్చి వంటి సంప్రదాయ పంటలతో నష్టాలపాలైన కర్షకులు పంట మార్పిడికి శ్రీకారం చుట్టి అధిక దిగుబడి సాధిస్తున్నారు.

ఎకరానికి రూ.లక్ష లాభం

గుంట భూమి బంతి సాగులో 10 నుంచి 15వేల రూపాయలు, ఎకరానికి లక్ష నుంచి లక్షా యాభైవేల రూపాయల లాభం పొందుతున్నారు. సంప్రదాయ పంటల కన్నా బంతి సాగుతో లాభాల బాట పట్టవచ్చని నారాయణపూర్​ రైతులు తెలిపారు. కాలాన్ని బట్టి పంట మార్పడి చేయడం వల్ల అధిక దిగుబడి పొందవచ్చని కొత్తపల్లి కర్షకులు చెబుతున్నారు.

మొదట బంతికే..

పంట చేనులో బంతి చెట్లు పెట్టుకుంటే... పురుగు మొదటగా బంతికే వస్తుందని, తద్వారా పంటకు ఏ పురుగు సోకుతుందో ముందే తెలుసుకుని నివారించేందుకు వీలుంటుందని రైతులు తెలిపారు.

బంతి సాగు మేలు

గతేడాది వానలు తక్కువగా ఉండటం వల్ల అధిక లాభాలు గడించామని, ఈ ఏడాది తరచూ వర్షాలు కురవడం వల్ల దిగుబడి తగ్గిందని కర్షకులు చెబుతున్నారు. అన్ని పంటలకన్నా బంతి సాగు మేలని తెలిపారు.

ఆ పండుగలకే
బంతి సాగుకు కాలపరిమితి మూడు నెలలు. ఆ తర్వాత బంతి చెట్లు చనిపోతాయి. పెత్రమాస, బతుకమ్మ, దీపావళి, కార్తీక మాసం పండుగలకు బంతి పూలు తెంపుతారు. కిలోకు వంద నుంచి150 వరకు ధర పలుకుతుంది. ఇప్పుడు కొంచెం ధర తగ్గిందని, అయినా పెట్టుబడికి మించి లాభాలు వస్తున్నాయని రైతులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details