ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షాలతో పొలాల్లో వరద పోటెత్తడం వల్ల పంటలన్నీ నీటిపాలయ్యాయి. భూపాలపల్లి జిల్లాలో అధిక వర్షపాతం నమోదు కావటం వల్ల వాగులు, వంకలు ఉప్పొంగి పంటలను ముంచేశాయి.
ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం - bhupalapally news
పది రోజుల పాటు కురిసిన భారీ వర్షాలతో రైతన్నకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటలన్నీ నీట మునిగిపోయి మురిగిపోయాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పంటల నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తున్నామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యం బాబు తెలిపారు.
crop damaged due to heavy rains in jayashanker bhupalapally
జిల్లాలో వర్షాకాలం 96 వేల ఎకరాల వరి సాగు, 121 ఎకరాల పత్తి సాగు చేస్తున్నారు. ఆగస్టు 12 నుంచి 23 వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిశాయి. 70 శాతం ఎక్కువగా వర్షపాతం నమోదు కావటం వల్ల పంట పొలాలు నీట మునిగాయి. 25 వేల ఎకరాల పత్తి, 8500 ఎకరాల్లో వేసిన వరికి నష్టం వాటిల్లిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యం తెలిపారు. జిల్లాలో నష్టపోయిన పంటల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తున్నామన్నారు.