రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోతే బతకడం ఎలా అని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర నాయకులు గండ్ర సత్యనారాయణ రావు ప్రశ్నించారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సన్నాలకు క్వింటాకి రూ.2500 ధర చెల్లించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కూడలి వద్ద ఏఐఎఫ్బీ, సీపీఐ, సీపీఎంల మద్దతుతో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు.
సన్న ధాన్యం ముద్దు అని చెప్పిన సీఎం మాటలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. నియంత్రణ సాగు విధానం అమలు చేసిన ప్రభుత్వం... సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అర్హులైన రైతులకి పాసు పుస్తకాలు మంజూరు చేయాలని కోరారు. ఈనెల 8న జరిగే భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.