కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి కొవిడ్ నియంత్రణ టీకాలు ఇవాళ చేరుకున్నాయి. మొదటి విడతగా 56 వైల్స్ వచ్చాయని వైధ్యాధికారులు తెలిపారు. ఆ టీకాను తొలత 560 మందికి వేయనున్నట్లు వెల్లడించారు.
టీకాలకు పూలతో స్వాగతం పలికిన సిబ్బంది
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి కొవిడ్ నియంత్రణ టీకాలు నేడు చేరుకున్నాయి. పోలీసుల బందోబస్తు నడుమ అధికారులు వ్యాక్సిన్‌ను భద్రపరిచారు. ఈ నెల 16న ప్రారంభం కానున్న కొవిడ్ వ్యాక్సినేషన్‌కు జిల్లాలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
టీకాలకు పూలతో స్వాగతం పలికిన సిబ్బంది
భూపాలపల్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో 401 మంది కరోనా బాధితులు, చిట్యాల ఆరోగ్యకేంద్రంలో కొవిడ్ సోకిన వారు 88 మంది ఉండగా.. మహదేవ్పూర్ ఆరోగ్యకేంద్రంలో 71 మంది కరోనా బాధితులకు ఆ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ నెల 16న వ్యాక్సినేషన్ ఉంటుందని జిల్లా వైద్యాధికారి వివరించారు.
ఇదీ చూడండి :జాయ్రైడ్స్లో యువత... రెండో రోజు ఉత్సాహంగా పోటీలు