కరోనా మహమ్మారి కుటుంబాలను చిదిమేస్తోంది. కొవిడ్‌తో భర్త మరణించిన మూడు రోజులకే భార్య మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మరోవైపు వీరి కొడుకు పాషా, కోడలు షమా కరోనాతో బాధపడుతున్నారు. బ్లాక్ ఫంగస్ బారిన పడిన సత్తార్ హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
మూడు రోజుల వ్యవధిలో కరోనాతో దంపతులు మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో కొవిడ్ బారిన పడి దంపతులు మృతి చెందారు. మూడు రోజుల వ్యవధిలోనే ఇద్దరూ మరణించారు. వారి కొడుకు, కోడలూ కరోనాతో బాధపడుతున్నారు.
కరోనాతో దంపతులు మృతి, కొవిడ్‌తో భార్యభర్తలు మృతి
హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పది రోజులుగా చికిత్స పొందుతూ సత్తార్ భార్య రబునిసా ఆదివారం మృతిచెందింది. ఇద్దరి చికిత్స కోసం రూ.10 లక్షల దాకా ఖర్చయినట్లు పాషా తెలిపారు. ఆమె అంత్యక్రియలకు బంధువులు దూరంగా ఉండడంతో ఉపసర్పంచ్ పోతర్ల అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఇదీ చదవండి:coronavirus india: దేశంలో కొత్తగా 1.52లక్షల మందికి కరోనా