తెలంగాణ

telangana

ETV Bharat / state

Containment Zones: భూపాలపల్లి జిల్లాలో కంటైన్​మెంట్​ జోన్లు ఏర్పాటు - corona virus spreading in jayashankar bhupalapalli district

భూపాలపల్లి జిల్లాలో కంటైన్​మెంట్​ జోన్లు ఏర్పాటు చేసి కరోనా వ్యాప్తిని కట్టడి చేస్తున్నారు. రాకపోకలను రద్దు చేసి మహమ్మారిని నియంత్రిస్తున్నారు. వైరస్​ వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

containment zones setup in jayashankar bhupalapalli district to control corona virus spread
భూపాలపల్లి జిల్లాలో కంటైన్​జోన్ల ఏర్పాటు

By

Published : Jun 5, 2021, 12:53 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో కరోనా కేసులు పెరిగిపోతుండటం వల్ల జిల్లా కలెక్టర్ పలు ప్రాంతాలను కంటైన్​మెంట్​ జోన్​లుగా ప్రకటించారు. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరాన్ని కంటైన్​మెంట్​​గా ఏర్పాటు చేశారు. అదే విధంగా మహదేవపూర్​లోని 1, 2, 4, 7, 9 వార్డులు, అంబట్ పల్లి, ఎలికేశ్వరం, సూరారం ప్రాంతాలను కంటైన్​మెంట్​ జోన్​లుగా ఏర్పాటు చేశామని వెల్లడించారు.

కాళేశ్వరం వచ్చే భక్తులను, యాత్రికులను పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపేస్తున్నారు. కాళేశ్వరంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ ఉండడం వల్ల గ్రామంలోకి ఎవరూ రాకుండా, ఎవరూ బయటకు వెళ్లకుండా అధికారులు కంచెలు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:Eatala Resignation: తెరాసతో తెగతెంపులు... నేడు ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details