తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యుత్​ బిల్లుల పెంపుపై కాంగ్రెస్​ నిరసన - విద్యుత్​ బిల్లుల పెంపుపై కాంగ్రెస్​ నిరసన

జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో విద్యుత్​ బిల్లుల పెంపుపై కాంగ్రెస్​ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. బీపీఎల్​ కుటుంబాలను అధిక విద్యుత్​ బిల్లుల నుంచి మినహాయించాలని డిమాండ్​ చేశారు.

congress protest
విద్యుత్​ బిల్లుల పెంపుపై కాంగ్రెస్​ నిరసన

By

Published : Jul 6, 2020, 4:25 PM IST

విద్యుత్​ బిల్లుల పెంపుపై జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్​ శ్రేణులు నిరసన బాటపట్టారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్​బాబు సూచనలతో ట్రాన్స్​కో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. నల్ల బ్యాడ్జిలు ధరించి నినాదాలు చేశారు. అనంతరం ఏఈకి వినతిపత్రం అందించారు.

లాక్​డౌన్​ సమయంలో బీపీఎల్​ కుటుంబాలను విద్యుత్​ బిల్లుల నుంచి మినహాయించాలని.. టెలిస్కోపిక్​ పద్ధతిని తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. చిన్న వ్యాపారులకూ అధిక విద్యుత్​ బిల్లుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.

ఇవీచూడండి:పేదల విద్యుత్​ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలి: ఉత్తమ్​

ABOUT THE AUTHOR

...view details