తెలంగాణ

telangana

ETV Bharat / state

'చమురు కంపెనీలు తగ్గించినా.. కేంద్రం ధరలు పెంచడమేంటీ?' - latest news of cong protest at bhupalapally

పెంచిన పెట్రోల్​, డీజిల్​ ధరలను వెంటనే తగ్గించాలంటూ కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కలెక్టర్​ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

congress protest in front of collectorate at jayashankar
'చమురు కంపెనీలు తగ్గించినా.. కేంద్రం ధరలు పెంచడమేంటీ?'

By

Published : Jun 29, 2020, 11:04 PM IST

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్​ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రకాశ్​ రెడ్డి, ఐఎన్​టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జనకప్రసాద్ పాలనాధికారికి వినతిపత్రం అందజేశారు. దేశంలోని ప్రజలు లాక్​డౌన్ సమస్యలతో సతమతమవుతుంటే.. పెట్రోల్​ డీజిల్​ ధరలు పెంచడం ఎంత మాత్రం సరికాదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చమురు కంపెనీలు క్రూడాయిల్ ధరలు తగ్గించినా కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ పై రేట్లు పెంచడం మధ్యతరగతి ప్రజల బతుకులు చిన్నాభిన్నం చేయడమేనని ఆయన విమర్శించారు. వెంటనే పెంచిన డీజిల్​ క్రూడ్​ ఆయిల్​ ధరలను తగ్గించాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి:'తబ్లీగీలను నిషేధించడంపై కేంద్రం వైఖరేంటి?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details