పెట్రో ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడిచర్లలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతున్నా.. ప్రభుత్వం రోజువారీగా ధరలు పెంచుతోందని ఆరోపించారు.
పెట్రో ధరల పెంపుతో పేదలపై పెనుభారం: కాంగ్రెస్ - భూపాలపల్లిలో కాంగ్రెస్ నాయకుల నిరసన
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడిచర్లలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. భాజపాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు.
పెట్రోల్ ధరల పెంపుకు కాంగ్రెస్ నాయకుల నిరసన
కరోనా ప్రబలుతున్న విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని ఎంపీపీ మల్హర్ రావు అన్నారు. ఆరేళ్లకాలంలో 18 లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేసి ప్రజల నడ్డి విరిచారని విమర్శించారు.