తెలంగాణ

telangana

By

Published : Jun 4, 2020, 6:38 PM IST

ETV Bharat / state

పారిశుద్ధ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ: కలెక్టర్

ప్రజా ప్రతినిధులు, అధికారులు.. ప్రజల భాగస్వామ్యంతో భూపాలపల్లి పట్టణంలోని కాలనీలు, మురుగు కాలువలను శుభ్రం చేసి, చెత్త, ముళ్ల పొదలను తొలగించాలని కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ ఆజిమ్ అన్నారు. ప్రభుత్వం వారం రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిబ్బందికి సూచించారు.

Collector Mohammed to clean up Bhupalapalli town
'భూపాలపల్లిలో పారిశుద్ధ్య నిర్మూలనపై ప్రత్యేక దృష్టి'

ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం ద్వారా.. భూపాలపల్లి పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ ఆజిమ్ అన్నారు. పట్టణంలోని సుభాశ్ కాలనీలో అధికారులు, స్థానిక కౌన్సిలర్​తో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ప్రభుత్వం వారంరోజులపాటు నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిబ్బందికి సూచించారు.

నీటి నిల్వ ఉండకుండా పనులు

ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో పట్టణంలోని అన్ని కాలనీలో మురుగు కాలువలను శుభ్రం చేసి, చెత్త, ముళ్ల పొదలను తొలగించాలని కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ ఆజిమ్ అధికారులను ఆదేశించారు. వర్షాలు పడిన తర్వాత నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ కొత్త హరిబాబు, ల్యాండ్ సర్వే ఏడీ సుదర్శన్, స్థానిక కౌన్సిలర్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, తహసీల్దార్ అశోక్ కుమార్ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:డాక్టర్లకు కరోనా ఎలా వచ్చింది?: ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

ABOUT THE AUTHOR

...view details