జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో కొవిడ్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ప్రకటించారు. గడిచిన వారం రోజుల నుంచి కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ నెల మొదటి నుంచి ఈ రోజు వరకు మొత్తం 39కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వివరించారు. గ్రామంలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకే నిత్యావసర వస్తువులు, ఆలయ దర్శనం తదితర పనులు నిర్వహించుకోవాలని కృష్ణ ఆదిత్య సూచించారు. ఉదయం 11 తర్వాత ఎవరూ బయటకు రాకూడదని పేర్కొన్నారు.
Kaleshwram: కరోనా కలకలం.. కంటైన్‌మెంట్ జోన్‌గా కాళేశ్వరం... - kaleshwaram as a containment zone
రాష్ట్రంలో కరోనా మహమ్మారి మళ్లీ కలవరపెడుతోంది. అక్కడకక్కడా కొన్ని ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ క్రమంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొలువై ఉన్న కాళేశ్వరంలో కొవిడ్ కలకలం రేపుతోంది. దీంతో కాళేశ్వరాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా భూపాలపల్లి కలెక్టర్ ప్రకటించారు.
కాళేశ్వరం
రాష్ట్రంలోని వివిధ పట్టణాలు, గ్రామాల నుంచి కాళేశ్వరం వచ్చే వారు తగు జాగ్రత్తలు పాటించాలని.. వీలైతే తమ కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని అధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తి నిర్మూలనకు సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమించి స్థానికులు, ఇతర గ్రామస్థులు, రోడ్లపైకి వస్తే పోలీసు శాఖ ఆధ్వర్యంలో కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
ఇదీ చదవండి:yadadri temple: తుది మెరుగులు దిద్దుకుంటోన్న యాదాద్రి..
Last Updated : Jul 11, 2021, 1:59 PM IST