జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని రేగొండ, సుల్తాన్పురం, చిన్నకొడపాక, దమ్మన్నపేట గ్రామాల్లో జరుగుతున్న రైతు వేదిక నిర్మాణ పనులను కలెక్టర్ అబ్దుల్ అజీమ్ పరిశీలించారు. రాత్రి 11 గంటల వరకు కలెక్టర్ పరిశీలన కొనసాగింది. పనుల తీరును అధికారులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు.
రాత్రి 11 గంటల వరకు పనులు పరిశీలించిన కలెక్టర్ - collector visit
జయశంకర్ జిల్లా రేగొండలో జరుగుతున్న రైతు వేదిక నిర్మాణ పనులను కలెక్టర్ అబ్దుల్ అజీమ్ రాత్రి 11 గంటల వరకు పరిశీలించారు. రైతు వేదిక నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను అదేశించారు.
![రాత్రి 11 గంటల వరకు పనులు పరిశీలించిన కలెక్టర్ collecter abdhul azim inspected raithuvedhika works till 11'o clack](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9109736-303-9109736-1602231668739.jpg)
collecter abdhul azim inspected raithuvedhika works till 11'o clack
ఈనెల 17లోపు నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని పీఆర్ ఈఈ రాంబాబు, అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ జివాకర్ రెడ్డి, ప్రత్యేక అధికారి మనోహర్, డీపీఆర్‌వో రవికుమార్, ఎంపీడీవో సురేందర్, ఏవో వాసుదేవరెడ్డి, పీఆర్ డీఈ ఆత్మారాం, ఏఈ సతీశ్, ఏఈవో ప్రశాంత్ , సర్పంచులు చందు, శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.