జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా సింగరేణి, కాకతీయ, ఓపెన్ కాస్ట్ సెక్టార్ 1,2 గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భారీగా వర్షం నీరు చేరడం వల్లే బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది.
3 టన్నుల ఉత్పత్తికి అంతరాయం..

రోజుకు సుమారు 3 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సింగరేణి సంస్థకు దాదాపు రూ.40 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేశారు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి కురుస్తోన్న వర్షానికి ఓపెన్ కాస్ట్లోకి వరదనీరు చేరి బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి.
ఇవీ చూడండి : కృష్ణమ్మ దోబూచులు... ప్రవాహంలో హెచ్చుతగ్గులు..!