తెలంగాణ

telangana

ETV Bharat / state

బోరు తవ్వితే..... బొగ్గు బయటపడింది.. - బొగ్గు నిక్షేపాలు

భూపాలపల్లి జిల్లాలో బొగ్గు నిక్షేపాలు బయలుపడ్డాయి. చండ్రుపల్లిలో బోరు తవ్వకాలు చేపటుతుండగా ఈ నిక్షేపాలు ఉన్నట్లు తేలింది.

బోరు తవ్వకాల్లో..... బొగ్గు నిక్షేపాలు

By

Published : Jul 3, 2019, 10:29 AM IST

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం చండ్రుపల్లిలో బొగ్గు నిక్షేపాలు బయటపడ్డాయి. గ్రామం వద్ద పంట పొలంలో బోరు తవ్వకాలు చేపట్టిన సర్పంచి సురేందర్‌..మొదట్లో నీటికి బదులుగా బొగ్గు బయటపడటాన్ని గమనించారు. మరింత లోతుకు తవ్విన తర్వాతే నీరు బయటకు వచ్చింది. గోదావరికి సమీపంలోని పొలంలో ఇది చోటుచేసుకుంది. గతంలో 1982-83 సంవత్సరంలోనూ చండ్రుపల్లిలో ఓ వ్యక్తి తన పొలంలో చేతి బోరు వేస్తుండగా ఇలాగే నిక్షేపాలు బయటపడ్డాయి. 1990లోనూ మరోమారు ఓఎన్‌జీసీ సర్వే చేసింది. అనంతరం 1993-94లో సింగరేణి సంస్థ పరిశోధనలు చేస్తున్న క్రమంలో.. మావోయిస్టులు యంత్రాలను తగలబెట్టారు. ఫలితంగా పనులు నిలిచిపోయాయి. తిరిగి ఇప్పుడు మళ్లీ బొగ్గు బయటపడటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

ABOUT THE AUTHOR

...view details