సొంత ఖర్చుతో ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోలేని వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రూ.10 లక్షలు విలువ చేసే సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
భూపాలపల్లిలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
భూపాలపల్లిలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం ఛైర్పర్సన్ సెగ్గెం వెంకట రాణీ, వైస్ ఛైర్మన్ కొత్త హరిబాబు పలువురు తెరాస నాయకులు పాల్గొన్నారు.