ముక్తేశ్వర స్వామికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు - undefined
ముక్తేశ్వరస్వామి ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అంబటిపల్లి సమీపంలోని లక్ష్మీ బ్యారేజీను సందర్శించనున్నారు.
కాళేశ్వరం ముక్తేశ్వరస్వామి సన్నిధిలో సీఎం కేసీఆర్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర క్షేత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. గోదావరి ఘాట్‌కు వెళ్లి... గోదావరి-ప్రాణహిత గంగా పవిత్ర జలాలను తలమీద చల్లుకున్నారు. అనంతరం నీటిలో నాణేలు వదిలి పుష్పాంజలి ఘటించి జల నీరాజనాలు అర్పించారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కాళేశ్వరం ముక్తేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేశారు.