ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం, మరో హెలికాప్టర్లో మంత్రి ఈటల, ఇతర అధికారులు, ఇంజినీర్లు పయనమవుతారు.
నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటన - ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రాణహిత జలాలు ఎత్తిపోయడం వల్ల మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు గోదావరి నది సజీవంగా మారింది. ఈ జలకళను వీక్షించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు.
![నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4052940-thumbnail-3x2-cm.jpg)
నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటన
నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం పర్యటన
కేసీఆర్... విహంగ వీక్షణం
ఉదయం 10.50 గంటలకు సీఎం కేసీఆర్ మేడిగడ్డ చేరుకుంటారు. మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు 140 కిలోమీటర్ల మేర గోదావరి పరీవాహక ప్రాంతంలోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం, కాళేశ్వరం ఇతర ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా తిలకిస్తారు. గోలివాడ పంపుహౌస్ చేరుకుని ఎల్లంపల్లి బ్యారేజీని పరిశీలిస్తారు. అక్కడే మధ్యాహ్నం భోజనం చేసి 2 గంటలకు గోలివాడ నుంచి ధర్మపురికి చేరుకుంటారు. లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకుని 3 గంటలకు తిరిగి హైదరాబాద్కు పయనమవుతారు.
- ఇదీ చూడండి : సుప్రీంకోర్టు జడ్జీల పెంపు బిల్లుకు లోక్సభ ఆమోదం
Last Updated : Aug 6, 2019, 9:47 AM IST