తెలంగాణ

telangana

By

Published : Jan 19, 2021, 10:48 AM IST

Updated : Jan 19, 2021, 11:17 AM IST

ETV Bharat / state

కాళేశ్వరం చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్

సీఎం కేసీఆర్ కాళేశ్వరం చేరుకున్నారు. కాళేశ్వరం ముక్తేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. కాళేశ్వరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఏరియల్ వ్యూ ద్వారా కన్నెపల్లి పంప్‌హౌస్​ను సీఎం కేసీఆర్​ పరిశీలించనున్నారు. మూడో టీఎంసీ పనుల పురోగతిపైన సమీక్షించే అవకాశం ఉంది.

kcr
kcr

సీఎం కేసీఆర్​ కాళేశ్వరం చేరుకున్నారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఛైర్మన్, అర్చకులతో కాసేపు సమావేశమవుతారు. అనంతరం అక్కడి నుంచి మేడిగడ్డ వద్ద ఉన్న లక్ష్మి ఆనకట్టకు చేరుకుంటారు.

లక్ష్మీ ఆనకట్ట వద్ద ప్రస్తుతం నీటిమట్టం పూర్తి నిల్వసామర్థ్యమైన 100 మీటర్లకు చేరుకొంది. గరిష్ఠ మట్టానికి చేరుకున్నప్పుడు జలాశయం, పరిసర ప్రాంతాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పట్నుంచో భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఇవాళ జలాశయం సహా పరిసర ప్రాంతాలను సీఎం పరిశీలిస్తారు.

విహంగ వీక్షణం...

విహంగవీక్షణంతో పాటు నేరుగా పర్యటించి ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను తెలుసుకుంటారు. అనంతరం అక్కడే ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. అధికారులు, ఇంజినీర్లతో సంబంధిత అంశాలపై చర్చిస్తారు. జలాశయంలో ప్రస్తుత నీటి పరిమాణం, ఎగువ నుంచి ప్రవాహం అవకాశాలు, దిగువకు విడుదల తదితర అంశాలపై సమీక్షిస్తారు.

ప్రాజెక్టులోని మొదటి, రెండో లింక్‌లో ప్రస్తుతం నీటి ఎత్తిపోతల కొనసాగుతోంది. ఆ ప్రక్రియను ముఖ్యమంత్రి ఇంజినీర్లతో సమీక్షించనున్నారు. మూడో టీఎంసీ పనుల పురోగతిపైనా సీఎం సమీక్షించే అవకాశం ఉంది. సమీపంలోని ఎగువ ప్రాంతాలకు నీరు అందించే ప్రణాళికలపై చర్చించనున్నారు. వాటి ఆధారంగా అధికారులు, ఇంజినీర్లకు దిశానిర్దేశం చేస్తారు. సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి హైదరాబాద్ తిరుగు పయనమవుతారు. సీఎం రాక దృష్ట్యా పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Last Updated : Jan 19, 2021, 11:17 AM IST

ABOUT THE AUTHOR

...view details