తెలంగాణ

telangana

ETV Bharat / state

క్రిస్మస్​ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి - cristamas_vedukalu

భూపాలపల్లి పట్టణంలో బేతెస్థ ప్రార్థన మందిరంలో జరిగిన క్రిస్మస్​ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. అందరూ జీసస్​ అనుసరించిన మార్గంలో నడవాలని సూచించారు.

christamas celebrations in jayashankar bhupalapally district
క్రిస్మస్​ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి

By

Published : Dec 25, 2019, 11:06 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి పట్టణంలోని బేతెస్థ ప్రార్ధన మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ వేడుకలకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరై కేక్ కట్ చేశారు. చర్చి ఫాదర్​ ఎమ్మెల్యేకు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అందరూ జీసస్ అనుసరించిన మార్గంలో నడవాలని... ఆయన చెప్పిన జీవితసత్యాలను పాటించాలని సూచించారు. ప్రభుత్వం తరఫున క్రైస్తవ సోదరులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

క్రిస్మస్​ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి

ABOUT THE AUTHOR

...view details