తెలంగాణ

telangana

ETV Bharat / state

చిట్యాల సర్పంచ్ రాజయ్య మృతి... ఉప సర్పంచ్​కి బాధ్యతలు - chityal mandal sarpanch masu rajaiah died of illness

అనారోగ్యంతో హన్మకొండలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల సర్పంచ్ మాసు రాజయ్య(48) మృతి చెందారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయన మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

chityal mandal sarpanch masu rajaiah died of illness
అనారోగ్యంతో చిట్యాల మండల సర్పంచ్ రాజయ్య మృతి

By

Published : Sep 3, 2020, 11:07 AM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల సర్పంచ్ మాసు రాజయ్య(48) అనారోగ్యంతో హన్మకొండలోని ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు.. సర్పంచ్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చిట్యాల సర్పంచ్​గా.. ఉపసర్పంచ్​కు బాధ్యతలు అప్పగించారు. రాజకీయాల్లోకి రాకముందు మాసు రాజయ్య రిపోర్టర్​గా విధులు నిర్వహించేవారు. సర్పంచ్​గా రాజయ్య.. గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించేవారని గ్రామస్థులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details