తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎట్టి పరిస్థితుల్లో 'ఛలో మల్లారం' నిర్వహిస్తాం: దండు రమేశ్‌ - ఛలో మల్లారం తాజా వార్తలు

ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 26న నిర్వహించనున్న ఛలో మల్లారం కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా నిర్వహిస్తామని సంఘం నాయకులు తెలిపారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో రేవల్లి రాజబాబు హత్యను ఖండిస్తూ ఈ కార్యక్రమం చేపట్టనట్లు పేర్కొన్నారు.

ఎట్టి పరిస్థితుల్లో 'ఛలో మల్లారం' నిర్వహిస్తాం: దండు రమేశ్‌
ఎట్టి పరిస్థితుల్లో 'ఛలో మల్లారం' నిర్వహిస్తాం: దండు రమేశ్‌

By

Published : Jul 23, 2020, 5:54 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లారం గ్రామంలో ఈనెల 6న రేవల్లి రాజబాబు దారుణ హత్యకు గురయ్యాడు. ఇలాంటి ఘటనలను ఖండిస్తూ ఈ నెల 26న ఛలో మల్లారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు దండు రమేశ్‌ కొయ్యూరు మీడియా సమావేశంలో తెలిపారు. 2014 సంవత్సరం తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాతి నుంచే మంథని నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీలపై అరాచకాలు పెరుగుతున్నాయన్నారు.

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఛలో మల్లారం కార్యక్రమాన్ని ఎలాగైనా ఆపేయాలని తెరాస కుట్ర చేస్తోందని ఆరోపించారు. నియోజకవర్గంలో చనిపోయిన వారికి తెరాస పార్టీ ఎలాంటి సహాయం చేయలేదని.. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీలను ఆదుకోలేదన్నారు. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని మల్హర్ మండలంలో 144 సెక్షన్ విధించడం సబబు కాదని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఛలో మల్లారం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని స్పష్టం చేస్తూ గోడ పత్రికను ఆవిష్కరించారు.

ఛలో మల్లారం గోడ పత్రిక ఆవిష్కరణ

ఇదీ చూడండి:తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details