భూపాలపల్లి జిల్లా చలో మల్లారానికి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి రావాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎస్సీ యువకుడి హత్య, ఎస్సీలపై దాడులకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ నేతల చలో మల్లారానికి అనుమతి నిరాకరణ - చలో మల్లారం కార్యక్రమం
ఎస్సీ యువకుడి హత్య, ఎస్సీలపై దాడులకు నిరసనగా చలో మల్లారం కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా పోలీసులు వీరికి అనుమతి ఇచ్చేందుకు నిరాకరించారు.
కాంగ్రెస్ నేతల చలో మల్లారం... అనుమతి నిరాకరించిన పోలీసులు
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో చలో మల్లారం పేరిట ఆందోళన నిర్వహించాలని సూచించారు. పలువురు నేతలతో ఉత్తమ్ సైతం కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయలుదేరారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆందోళన విరమించుకోవాలని పోలీసులు సూచించారు. పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. భూపాలపల్లిలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబును గృహనిర్బంధం చేశారు.
ఇదీ చూడండి:కార్గిల్ కొదమసింహం కెప్టెన్ విజయంత్ థాపర్