తెలంగాణ

telangana

ETV Bharat / state

10వేల మొక్కలు నాటిన సింగరేణి డైరెక్టర్ - 10 వేల మొక్కలు స్వయంగా నాటిన బలరామ్​

10వేల మొక్కలు స్వయంగా నాటిన సింగరేణి డైరెక్టర్ (ఫైనాన్స్ & పీ&పీ)ఎన్.బలరామ్​ను ఎస్టీ ఉద్యోగుల సంఘం ఘనంగా సన్మానించింది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ప్రాంతాల్లో ఆయన మొక్కలు నాటారు.

central employees honor the sccl employee balaram
10 వేల మొక్కలు నాటిన ఉద్యోగికి ఘనంగా సన్మానం

By

Published : Feb 18, 2021, 7:42 PM IST

10 వేల మొక్కలు స్వయంగా నాటిన సింగరేణి డైరెక్టర్ (ఫైనాన్స్ & పీ&పీ)ఎన్.బలరామ్​ను ఎస్టీ ఉద్యోగుల సంఘం ఘనంగా సన్మానించింది. సింగరేణి సంస్థలో బలరామ్ భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-5 గని వద్ద.. ఫిబ్రవరి 17న జరిగిన సింగరేణి వృక్షోత్సవంలో స్వయంగా 625 మొక్కలు నాటారు.

10 వేల మొక్కలు నాటిన ఉద్యోగికి ఘనంగా సన్మానం

సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ప్రాంతాల్లో బలరామ్ గత ఏడాది నుంచి స్వయంగా పర్యావరణ ప్రేమికునిగా, వృక్ష హితునిగా 9,999 మొక్కలు నాటారు. ఆయన నాటిన మొక్కలు నేడు చక్కగా ఎదుగుతూ అందరిలో స్ఫూర్తి రగిలిస్తున్నాయని తోటి ఉద్యోగులు పేర్కొన్నారు. సింగరేణి డైరెక్టర్ ఫైనాన్స్ గానే కాక పీ&పీ గాను, సామాజిక సేవా కార్యక్రమాల నిర్వాహకులుగా అనేక సమాజ హిత కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు.

10 వేల మొక్కలు నాటిన ఉద్యోగికి ఘనంగా సన్మానం

అత్యంత పేదరికం నుంచి అత్యున్నత స్థానానికి ఎదిగిన బలరామ్.. శ్రమజీవులైన కార్మికుల పట్ల ఎంతో అభిమానంతో వ్యవహరిస్తున్నారని తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూన్నారని కేంద్ర నాయకులు ప్రశంసించారు. బలరామ్ స్నేహశీలి, వృత్తి, సమాజం పట్ల సేవా నిరతి గల మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సింగరేణి ఎస్.టి.ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బానోత్ కర్ణ, వైస్ ప్రెసిడెంట్ తేజావత్ హిర్య నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ వసంత్, వైస్ ప్రెసిడెంట్ బి.వెంకట్రామ్, లైజన్ ఆఫీసర్ కె.రమేష్, ఏరియా ప్రెసిడెంట్ మోహన్, సెక్రటరీ హేమ నాయక్, ప్రేమ్ సింగ్, రమేష్, గణేష్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :డ్రగ్​కు యూఎస్ఎఫ్​డీఏ అనుమతి : మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details