తెలంగాణ

telangana

ETV Bharat / state

ములుగు కలెక్టర్​గా ​ సి.నారాయణరెడ్డి - ములుగు కలెక్టర్​

ములుగు కలెక్టర్​గా సి.నారాయణరెడ్డి బాధ్యతలు చేపట్టారు. అందరి సహకారంతో జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.

ములుగు

By

Published : Mar 4, 2019, 8:31 PM IST

ములుగు కలెక్టర్​గా నారాయణరెడ్డి బాధ్యతలు
ములుగు జిల్లాకు కలెక్టర్​గా బదిలీ అయిన సి.నారాయణ రెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. గతంలో నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్​గా పనిచేసిన ఆయనను ప్రభుత్వం పదోన్నతిపై ములుగు పాలనాధికారిగా నియమించింది. కొత్త కలెక్టర్​ను వివిధ శాఖల అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి.. శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో ప్రజల సమస్యలపై దృష్టి సారించి సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ములుగు జిల్లా ఏర్పాటైన తర్వాత నారాయణరెడ్డి మొదటి కలెక్టర్​గా నియమితులయ్యారు. ఇంత వరకు ఇం​ఛార్జీ కలెక్టర్​ పాలన సాగింది.

ఇవీ చూడండి :సీపీ పూజలు

ABOUT THE AUTHOR

...view details