జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ అస్వస్థతకు గురయ్యారు. తెల్లవారుజామున బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. కుటుంబ సభ్యుల సమాచారంతో డీపీఓ సుధీర్ బాబు, తహసీల్దార్ అశోక్ వెంటనే వెళ్లారు. హుటాహుటిన వరంగల్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.
వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు తహసీల్దార్ అశోక్ పేర్కొన్నారు. పని ఒత్తిడితోనే ఆయన అనారోగ్యం పాలైనట్లు పలువురు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.