తెలంగాణ

telangana

ETV Bharat / state

బోస్టన్ మారథాన్ పూర్తి చేసిన గండ్ర జ్యోతి - gandra jyothi

ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన బోస్టన్ మారథాన్​లో పాల్గొని విజయవంతంగా పూర్తి చేశారు జయశంకర్​భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 37 వేల మంది పాల్గొన్నారు.

బోస్టన్ మారథాన్ పూర్తి చేసిన గండ్ర జ్యోతి

By

Published : Apr 17, 2019, 2:31 PM IST

అమెరికాలోని హబీకిన్ నుంచి బోస్టన్ వరకు జరిగిన 42 కిలోమీటర్ల ఈ మారథాన్​ ఈనెల 15న జరిగింది. ఇందులో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి సతీమణి జ్యోతి పాల్గొన్నారు. వణికించే చలిని తట్టుకొని 5గంటల 19 నిమిషాల్లో దీనిని పూర్తి చేశారు. జ్యోతికి నిర్వాహకులు పతకం, ధ్రువీకరణపత్రం అందజేశారు. మారథాన్ విజేత 2 గంటల 9నిమిషాల్లో పూర్తి చేశాడు.

బోస్టన్ మారథాన్​ను 1897 నుంచి నిర్వహిస్తున్నారు. ఈసారి భారతదేశం నుంచి సుమారు 55 మంది పాల్గొన్నారు . అందులో తెలంగాణనికి చెందినవారు ఏడుగురు ఉన్నట్టు సమాచారం. ఈ మారథాన్​లో పాల్గొనడం అంత సులువుగా రాదు. అథ్లెట్లుగా మంచి అనుభవమున్న వారికే అవకాశం దక్కుతుంది. గండ్ర జ్యోతి గతంలో హైదరాబాద్​తో పాటు వివిధ ప్రాంతాల్లో జరిగిన మారథాన్లలో పాల్గొని విజేతగా నిలిచారు.

బోస్టన్ మారథాన్ పూర్తి చేసిన గండ్ర జ్యోతి

ఇవీ చూడండి:భార్య పుట్టింటికి వెళ్లిందని పిల్లల్ని హతమార్చాడు

ABOUT THE AUTHOR

...view details