ఆదివారం సెలవురోజు కావటం వల్ల బోగత జలపాతం జనసంద్రంగా మారింది. జలపాతం నీటి ధారలను తిలకించేందుకు వచ్చిన సందర్శకులతో నీటి కొలను సందడిగా మారింది. వరద నీటికి అడ్డుగా ఏర్పాటు చేసిన రాతి కట్టపై నుంచి పర్యాటకులు నీటి ధారల అందాలను తిలకించారు. జలపాతం సందర్శనకు వచ్చిన పర్యాటకులు కుటుంబ సభ్యులు, చిన్నారులతో కలిసి పిల్లల పార్కులో ఉల్లాసంగా గడిపారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఏర్పడిన జలపాతాన్ని తిలకించేందుకు రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు.
రమణీయంగా మారిన తెలంగాణ నయాగరా - తెలంగాణ నయాగరా
తెలంగాణ నయాగరాగా పిలువబడుతున్న బోగత జలపాతం వెళ్ళే మార్గం పొడవున ఎటుచుసినా అందమైన ప్రదేశాలు పర్యాటకులని మంత్ర ముగ్ధులని చేస్తాయి. ప్రకృతి సౌందర్యాన్ని పరశింప చేస్తూ నింగి నుంచి నేలకు జాలువారిన పాలసంద్రంలా మారిన బోగత జలపాతం కనువిందు చేస్తోంది. ఇక్కడి ప్రకృతి అందాలు సందర్శకుల మనస్సు దోచుకుంటున్నది.
రమణీయంగా మారిన తెలంగాణ నయాగరా