తెలంగాణ

telangana

ETV Bharat / state

'చిన్నారిపై హత్యాచారం కేసులో నిందితుడికి కఠిన శిక్ష విధించాలి' - bjp mahila morcha protest at bhupalapally collectorate

ఆదిలాబాద్‌లో నాలుగేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తూ.. భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట నల్లబాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

bjp mahila morcha
భాజపా మహిళా మోర్చా

By

Published : Mar 17, 2021, 5:58 PM IST

రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరిస్తోందని భాజపా మహిళా మోర్చా ఆరోపించింది. ఆదిలాబాద్ జిల్లాలో నాలుగేళ్ల చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడికి కఠినశిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తూ.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట మహిళా మోర్చా నాయకులు ఆందోళన చేపట్టారు. ఘటనకు వ్యతిరేకంగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.

నిందితుడిని చట్టపరంగా కఠినంగా శిక్షించి.. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:సాగర్‌ ఉపఎన్నికలో గెలుపు మాదే: బండి సంజయ్‌

ABOUT THE AUTHOR

...view details