ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల,టేకుమట్ల,మొగుల్లపల్లి, నవాబ్‌పేట, ఏలేటిరామయ్యపల్లి , చిట్యాల, శాంతినగర్,గర్మిళపల్లి, భుర్నపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మొక్కలు నాటారు. దోమల నివారణ కొరకు దోమల మందును పిచికారీ చేశారు. గ్రామపంచాయతీల పరిధిలో ప్రతి ఇంటికి 6 మొక్కలు అందిస్తామని, ప్రజలు ఆ మొక్కలను ఇంటిలో నాటి సంరక్షించాలన్నారు. ప్రతి మొక్క సంరక్షణ బాధ్యత కుటుంబసభ్యులు తీసుకోవాలని కోరారు. పచ్చదనం పెంపొందించుకుంటేనే భవిష్యత్ తరాలు మంచి జీవనం కొనసాగించగలుగుతాయని అన్నారు. గతంలో మొక్కలు నాటడానికి జిల్లా స్థాయిలో కూడా నర్సరీలు సరిగ్గా ఉండేవి కావని.. ప్రస్తుతం సీఎం కేసిఆర్ నాయకత్వంలో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో నర్సరీ ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. గ్రామపంచాయతీ పరిధిలో అవెన్యూ ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్, కమ్యూనిటీ ప్లాంటేషన్ పరిధిలో మొక్కల సంరక్షణ కోసం ట్రీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
'ప్రతి ఇంటికి ఆరు మొక్కలు... వాటిని సంరక్షించుకోవాలి' - jayashankar bhuapalpally district news
పచ్చదనం పెంపొందించుకుంటేనే భవిష్యత్ తరాలు మంచి జీవనం కొనసాగిెంచగలుగుతాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఆరో విడత హరితహారంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలు గ్రామాల్లో మొక్కలు నాటారు. గ్రామ పంచాయతీల పరిధిలో ప్రతి ఇంటికి 6 మొక్కలు అందిస్తామని తెలిపారు. వాటిని కుటుంబసభ్యులు సంరక్షించుకోవాలని సూచించారు.
!['ప్రతి ఇంటికి ఆరు మొక్కలు... వాటిని సంరక్షించుకోవాలి' bhupalpally mla gandra venkataramana reddy participated in harithaharan programme](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7781459-129-7781459-1593176244134.jpg)
గ్రామాల్లో ఉన్న కోతుల సమస్య పరిష్కారానికి పండ్ల మొక్కలు నాటి పెంచడమే శాశ్వత పరిష్కారమని అన్నారు. ప్రతి గ్రామంలో మంకీ ఫుడ్‌కోర్టు ఏర్పాటు చేసి వివిధ రకాల పండ్ల మొక్కలు నాటి పూర్తి స్థాయిలో సంరక్షించాలని సూచించారు. గ్రామాలను హరితవనాలుగా తీర్చిదిద్దడం ప్రతి ఒక్కరి బాధ్యతని వివరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించి భాగస్వామ్యులను చేయాలని ఎమ్మెల్యే సూచించారు. పర్యావరణ సమతుల్యత కాపాడడానికి సీఎం ప్రారంభించిన హరితహారం కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని, ప్రభుత్వ ఆశయ సాధన దిశగా తమ వంతు సహకారం అందించాలని కోరారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు పట్టణ ప్రాంతంలో ప్రతి ఇంటికి మొక్కలు అందిస్తామని.. వాటిని ప్రజలు సంరక్షించాలని ఎమ్మెల్యే కోరారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఇక నుంచి ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఇవీ చూడండి:'రాష్ట్రాన్ని ఆకుపచ్చ వనంగా తీర్చిదిద్దడమే హరితహారం ఉద్దేశం'