సామాజిక సేవా రంగాల్లో యువతను ప్రోత్సహించేందుకు తెలంగాణ జాగృతి కృషి చేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ మైదానంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న జిల్లా స్థాయి కేసీఆర్ కప్ వాలీబాల్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు.
'క్రీడాకారులు నైపుణ్యం సాధించేందుకు ప్రోత్సాహం అందిస్తాం' - ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి తజా వార్తలు
క్రీడాకారులు మరింత నైపుణ్యాన్ని సాధించేందుకు ప్రోత్సాహం అందిస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. ఈ మేరుకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తోన్న కేసీఆర్ కప్ వాలీబాల్ పోటీలను ఆయన ప్రారంభించారు.
క్రీడాకారులు నైపుణ్యం సాధించేందుకు ప్రోత్సాహం అందిస్తాం : ఎమ్మెల్యే గండ్ర
కీడల్లో మంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు మరింత నైపుణ్యాన్ని సాధించేందుకు ప్రోత్సాహం అందిస్తామని ఎమ్మెల్యే గండ్ర తెలిపారు. జాగృతి బృందానికి అన్ని విధాలుగా అందుబాటులో ఉండి యువత అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా అధ్యక్షురాలు జ్యోతి, మున్సిపల్ కౌన్సిలర్లు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:రూపాయి పెట్టుబడి లేదు.. రూ.వేల కోట్ల ఆదాయం..