ఈవీఎంలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం అన్నారు. జయశంకర్ భూపాలపల్లిలోని సింగరేణి అంబేడ్కర్ మినీహాల్లో ఈవీఎంలను భద్రపరిచిన గదిని పరిశీలించారు. హాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు.
ఈవీఎం గదులను పరిశీలించిన భూపాలపల్లి జిల్లా కలెక్టర్ - Bhupalpally District Latest News
జయశంకర్ భూపాలపల్లిలోని సింగరేణి అంబేడ్కర్ మినీహాల్లో ఈవీఎంలను భద్రపరిచిన గదిని కలెక్టర్ అబ్దుల్ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.
evm
ఎన్నికల సంఘం నిర్దేశాలకనుగుణంగా ఈవీఎంలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపైన ఉందని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి.. రెవెన్యూ అధికారులు పర్యవేక్షించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, ఎలక్షన్ డీటీ రవికుమార్, ఆర్ఐ దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.