జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయానికి శాశ్వత భవనం నిర్మించేందుకు వెంటనే స్థలాన్ని అప్పగించాలని జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ రెవెన్యూ, ల్యాండ్ సర్వే అధికారులతో కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కేంద్రంలో గ్రంథాలయ భవనం ఏర్పాటుకు స్థలసేకరణపై తగు ఆదేశాలు జారీ చేశారు.
భూపాలపల్లిలో శాశ్వత గ్రంథాలయ ఏర్పాటుకు కలెక్టర్ ఆదేశాలు - భూపాలపల్లిలో శాశ్వత గ్రంథాలయ ఏర్పాటుకు కలెక్టర్ ఆదేశాలు
జిల్లాలో విజ్ఞానవంతులందరికీ ఉపయోగపడే గ్రంథాలయానికి శాశ్వత భవనం నిర్మించేందుకు వెంటనే స్థలాన్ని కేటాయించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ శుక్రవారం రెవెన్యూ అధికారులతో జరిగిన సమావేశంలో ఆదేశించారు.

భూపాలపల్లిలో శాశ్వత గ్రంథాలయ ఏర్పాటుకు కలెక్టర్ ఆదేశాలు
పాత గ్రామపంచాయతీ కార్యాలయంలో చాలీచాలని వసతులతో గ్రంథాలయం కొనసాగుతోందని.. అన్ని సౌకర్యాలతో కూడిన శాశ్వత భవనం అవసరం ఎంతైనా ఉందని అధికారులు కలెక్టర్కు తెలిపారు. వెంటనే గ్రంథాలయ భవన నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేయాలని రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఇవీచూడండి:ఈఎస్ఐ కేసు: దేవికారాణితోపాటు మరో ఎనిమిది మంది అరెస్ట్