తెలంగాణ

telangana

ETV Bharat / state

భూ సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి: కలెక్టర్​ - jayashankar bhupalapally district latest news

కోర్టు కేసులతో పెండింగ్​లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించడానికి అధికారులు కృషి చేయాలని... జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. ఇల్లందు క్లబ్​హౌస్​లో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు.

Bhupalpally Collector Krishna Aditya meeting with district Revenue officials
భూ సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలి

By

Published : Jan 21, 2021, 6:06 PM IST

వివిధ సమస్యలతో సంవత్సరాలుగా భూమి వివాదాలు కోర్టుల్లో అపరిష్కృతంగా ఉన్నాయని... జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. దాని వల్ల నిజమైన భూ యజమానులకు నష్టం కలుగుతుందని తెలిపారు. ఇల్లందు క్లబ్​హౌస్​లో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు.

గ్రామాలవారీగా పెండింగ్​లో ఉన్న భూముల వివరాలను సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వాటిని రికార్డు చేసి కంప్యూటర్​లో పొందుపర్చాలని అన్నారు. అదే విధంగా ప్రభుత్వ భూముల వివరాలను పరిశీలించి... ప్రస్తుతం ఉపయోగించుకుంటున్న, ఖాళీగా ఉన్న భూముల వివరాలు నమోదు చేయాలని తెలిపారు.

తద్వారా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడవచ్చని అన్నారు. ప్రభుత్వ అవసరాలకు భూమిని అందుబాటులో ఉంచుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అధికారులు జాగ్రత్తగా రెవెన్యూ రికార్డులను పరిశీలించి పొందుపరచాలని చెప్పారు.

ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యం: ఎస్పీ

ABOUT THE AUTHOR

...view details