జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ స్టేడియం వద్ద ఎన్నికల ఈవీఎంలను భద్రపరచిన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ సందర్శించారు. ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్ రూంలను, సీసీ కెమెరాలను ఆయన పరిశీలించారు.
ఎన్నికల ఈవీఎంలు భద్రపరచిన కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ - evm strog room and security inspected by collector at bhupalpall
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ స్టేడియం వద్ద ఉన్న ఎన్నికల ఈవీఎంలను భద్రపరచిన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ సందర్శించారు. ఈవీఎంలను జాగ్రత్తగా భద్రపరచాలని కలెక్టర్ తెలిపారు.
ఎన్నికల ఈవీఎంలు భద్రపరచిన కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
ఈవీఎంలను భద్రపరచిన రూంల వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్‌తో అదనపు కలెక్టర్, ఇన్‌ఛార్జి ఆర్డీవో, భూపాలపల్లి మండల డిప్యూటీ తహసీల్దార్ రవీందర్ తదితరులు ఉన్నారు.
ఇదీ చూడండి:ట్రంప్ మళ్లీ ఎన్నికైతే అమెరికా-ఇరాన్ మధ్య డీల్..!