తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రజలకు అందుబాటులో లేని వైద్యులపై కఠిన చర్యలు' - jayashankar bhupalpalli district news

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం చెల్పూర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి తనిఖీ చేశారు. ఉదయం 10 గంటలవుతున్నా.. విధులకు హాజరుకాని వైద్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bhupalpally, Bhupalpally MLA, MLA Gandra Venkataramana Reddy
భూపాలపల్లి, భూపాలపల్లి ఎమ్మెల్యే, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి

By

Published : May 13, 2021, 12:22 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం చెల్పూర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి తనిఖీ చేశారు. కరోనా నిర్ధరణ పరీక్ష కోసం వచ్చిన ప్రజలతో మాట్లాడి.. వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.

ఉదయం 10 గంటలవుతున్నా.. విధులకు హాజరు కాని వైద్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు. లేనియెడల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెంట గ్రామసర్పంచ్, పీఏసీఎస్ ఛైర్మన్, మండల ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details