రైతుల చెంతకే రెవెన్యూ సిబ్బంది - వాసం వెంకటేశ్వర్లు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పట్టాదారు పాసు పుస్తకాలు రాక రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై "జయశంకర్ భూపాలపల్లి భూ పరిష్కార వేదిక - రైతుల చెంతకే రెవెన్యూ సిబ్బంది " కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారం రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో రైతులు తమ భూ సమస్యలు పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

bhupalpalli collector started a program to solve land issues
రైతులు భూ సమస్యలతో నిత్యం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారని ఉద్దేశంతో భూ పరిష్కార వేదిక - రైతుల చెంతకే రెవెన్యూ సిబ్బంది అనే కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 75% మంది రైతులకు పాసు పుస్తకాలు అందాయని, మిగిలిన వారు ఈ కార్యక్రమం ద్వారా సమస్య పరిష్కరిస్తామన్నారు. అన్నదాతల సమస్యలు పరిష్కరించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన జిల్లా పాలనాధికారిని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అభినందించారు.
రైతుల చెంతకే రెవెన్యూ సిబ్బంది
- ఇదీ చూడండి : సాంకేతిక సమస్యతో రన్‌వేపై నిలిచిన ఇండిగో విమానం