జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లపై అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బందులు పెట్టకుండా సక్రమంగా అమ్మకాలు జరపాలన్నారు. వ్యవసాయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు. నిబంధనల ప్రకారమే వరిధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు సమర్థవంతంగా నిర్వహించాలి : గండ్ర
రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రం సింగరేణి క్లబ్‌హౌస్‌లో జరిగిన నియోజకవర్గస్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన పోస్టర్లను జిల్లా సంయుక్త కలెక్టర్ ఆవిష్కరించారు.
ధాన్యం రవాణాలో ఆలస్యం చేయరాదు: సంయుక్త కలెక్టర్
కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు,మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని జిల్లా సంయుక్త పాలనాధికారి కూరాకుల స్వర్ణలత కోరారు. ధాన్యం రవాణాకు గుత్తేదారులు లారీలను ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించి...టోకెన్ల జారీ చేసి, కొనుగోలు చేయాలని తెలిపారు. వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌ఛైర్మన్ శోభ, జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.