పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జయశంకర్ జిల్లా భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్యటించారు. పలు వార్డుల్లోని పారిశుద్ధ్యం, ఇతర వసతులపై ఆరా తీశారు. విద్యుత్ తీగలు సరిచేయాలని ఆ శాఖ సిబ్బందికి సూచించారు. డ్రైనేజీ వ్యవస్థల నిర్వహణ, చెత్త సేకరణపై సూచనలు చేశారు.
ట్రాక్టర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర - bhupalapally pattana pragathi
పట్టణ ప్రగతిలో భాగంగా భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్యటించారు. పారిశుద్ధ్యం, విద్యుత్ లైన్ల నిర్వహణపై సిబ్బందికి సూచనలు చేశారు.
ట్రాక్టర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో గొల్లబుద్ధారం, లంబాడి తండ, న్యూ రాంపూర్, దీక్ష కుంట, దూదేకులపల్లి, నందిగామ గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవీచూడండి:గతితప్పుతున్న ప్రయాణం... ఎంతోమంది జీవితాల్లో విషాదం!