తెలంగాణ

telangana

By

Published : Oct 6, 2020, 6:30 PM IST

ETV Bharat / state

ఈ-వెహికల్స్​ను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

కూరగాయల రవాణాకు ఈ-వెహికల్స్​ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ అన్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా సెర్ఫ్ నిధులతో కిచెన్ గార్డెన్ పథకం ద్వారా 3 ఈ-ఆటో రిక్షాలను మహిళా సంఘాలకు కలెక్టర్ పంపిణీ చేశారు.

Bhupalapally Collector Mohammed Abdul Azim distributed E- autos to women's associations for vegetable supply
ఈ-వెహికల్స్​ను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

కూరగాయలు సరఫరా చేయుటకు ఈ-వెహికల్స్ చాలా అనుకూలంగా ఉన్నాయని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ పేర్కొన్నారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా సెర్ఫ్ నిధులతో కిచెన్ గార్డెన్ పథకం ద్వారా 3 ఈ-ఆటో రిక్షాలను మహిళా సంఘాలకు కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ ఆటోరిక్షాల ద్వారా తాజా కూరగాయలను రవాణా చేసి రైతులు, గ్రామైక్య సంఘం సభ్యులు ఆర్థికంగా లాభాలు గడించాలని కోరారు.

వీటి ద్వారా బాలింతలకు, చిన్నారులకు, గర్భిణులకు పౌష్టికాహారం అందించనున్నట్లు వెల్లడించారు. వాటితో పాటు లాభసాటిగా మార్కెటింగ్ చేసుకునేందుకు ప్రణాళికలు వేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, సెర్ఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండిఃకూరగాయల మార్కెట్ షెడ్డులో అగ్నిప్రమాదం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details