భూపాలపల్లి జిల్లా చిట్యాల సీఐ ఆత్మహత్యాయత్నం - suicide attempt news
21:46 February 10
భూపాలపల్లి జిల్లా చిట్యాల సీఐ ఆత్మహత్యాయత్నం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల పోలీసు స్టేషన్లో సీఐగా విధులు నిర్వహిస్తున్న సాయి రమణ ఆత్మహత్యకు యత్నించాడు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం వద్ద తన వాహనంలో... పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అటుగా వెళ్తున్న బ్లూ కోర్ట్ సిబ్బంది గమనించి హుటాహుటిన మాక్స్ కేర్ ఆసుపత్రికి తరలించారు.
పరిశీలించిన వైద్యులు ప్రస్తుతం బాగానే ఉన్నట్లు తెలిపారు. సీఐ వాహనంలో ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అసలు సీఐ ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశారనేది తెలియరాలేదు.