జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం కమలపూర్లో... భూ సమస్యల పరిష్కారానికి రైతుల వద్దకే రెవెన్యూ సిబ్బంది పేరుతో చేపట్టిన భూ పరిష్కార వేదిక రెండో విడత కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. గత నెల 22 నుంచి 27 వరకు ఆరు రోజుల పాటు నిర్వహించిన తొలి విడతలో దాదాపు 2,700 సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించారు. ఇదే స్ఫూర్తితో రెండో విడత కార్యక్రమాన్ని జిల్లాలోని 11 మండలాల్లో ప్రారంభించగా... తొలి రోజు సోమవారం 250 సమస్యలు పరిష్కరించినట్లు కలెక్టర్ తెలిపారు. రైతుల భూ సమస్యల పరిష్కారానికి విడతల వారీగా సదస్సులు నిర్వహిస్తామని వెల్లడించారు. తొలిరోజు కాటారం, భూపాలపల్లి, గణపురం, రేగొండ మండలాల్లో జరిగిన గ్రామసభలకు కలెక్టర్ హాజరయ్యారు.
రెండో విడత భూ పరిష్కార వేదిక ప్రారంభం - jayashankar bhupalapally
భూ సమస్యల పరిష్కారానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ చేపట్టిన రైతుల వద్దకే రెవెన్యూ సిబ్బంది కార్యక్రమం రెండో విడత సోమవారం ప్రారంభమైంది. తొలిరోజే 250 సమస్యలు పరిష్కరించారు.
రెండో విడత భూ పరిష్కార వేదిక ప్రారంభం