కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పిలుపునిచ్చిన భారత్ బంద్... జయశంకర్ భూపాలపల్లి జిల్లావ్యాప్తంగా కొనసాగుతోంది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అన్ని యూనియన్లు బంద్కు మద్దతుగా నిలిచాయి. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి ఆధ్వర్యంలో భూపాలపల్లిలో బైక్ ర్యాలీ నిర్వహించి... అనంతరం ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేపట్టారు.
'కార్పొరేట్ శక్తుల కోసమే కొత్త వ్యవసాయ చట్టాలు' - జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాజా వార్తలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లావ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కొత్త చట్టాలతో రైతులు నష్టపోవాల్సి వస్తుందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
నూతన వ్యవసాయ చట్టాలు రైతుల నడ్డి విరిచేలా ఉన్నాయని... చిన్న, సన్నకారు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని వివిధ పార్టీల నాయకులు వాపోయారు. దేశంలో 80 శాతం చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని... పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటున్నారు కానీ కార్పొరేట్ శక్తులే లాభపడతాయని నాయకులు ఆరోపించారు. గిట్టుబాటు ధర కల్పించకపోతే దళారుల చేతిలో రైతులు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్నదాతల సమస్యలు పరిష్కరించకపోతే... రానున్న రోజుల్లో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:సాగు చట్టాలపై కర్షక భారతం కన్నెర్ర
TAGGED:
bharat bandh in telangana