తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రభుత్వ సంకల్పానికి బ్యాంకర్ల తోడ్పాటు అవసరం' - telangana news

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి హాజరయ్యారు. 2021- 2022 నాబార్డ్ వార్షిక రుణ ప్రణాళిక బుక్​లెట్​ను విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీతో కూడిన అనేక పథకాలను ప్రవేశపెట్టిందని.. బ్యాంకర్లు ప్రభుత్వ సంకల్పానికి తోడ్పాటును అందించాలని పేర్కొన్నారు.

bankers meeting at bhupalpally district
'ప్రభుత్వ సంకల్పానికి బ్యాంకర్ల తోడ్పాటు అవసరం'

By

Published : Dec 17, 2020, 10:51 PM IST

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి, రుణాలపై అవగాహన కలిగేలా సదస్సులు నిర్వహించాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి బ్యాంకర్లకు సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్​లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గండ్ర.. జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలతతో కలిసి జిల్లాలో ఆర్థికాభివృద్ధికి బ్యాంకులు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. నాబార్డ్ వారు 874.54 కోట్ల రూపాయలతో రూపొందించిన 2021- 2022 వార్షిక రుణ ప్రణాళిక బుక్​లెట్​ను విడుదల చేశారు.

రుణాలు సకాలంలో అందించాలి:

"నిరుద్యోగ యువత, రైతులు, మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీతో కూడిన అనేక పథకాలను ప్రవేశపెట్టింది. బ్యాంకర్లు ప్రభుత్వ సంకల్పానికి తోడ్పాటును అందించాలి. నిర్ధేశిత లక్ష్యం మేరకు రైతులకు పంట రుణాలు, స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ రుణాలు సకాలంలో ఇవ్వాలి. వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, చేపల పెంపకం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందేలా రుణాలను సద్వినియోగం చేయాలి.

స్థానిక మార్కెట్లో డిమాండ్ ఉండే వస్తువుల తయారీ యూనిట్లను స్థాపించుటకు స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు రుణాలను అందించాలి. ఆహార ఆధారిత యూనిట్ల స్థాపన ద్వారా స్వయం ఉపాధి పొందేలా యువతకు రుణాలను ఇవ్వాలి. జిల్లాలో ప్రజలకు నాణ్యమైన పాలను అందించేందుకు పాడి గేదెల యూనిట్లను రైతులకు అందించేందుకు పశుసంవర్ధక శాఖ ద్వారా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. "

-గండ్ర వెంకటరమణా రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే

"వానాకాలం, యాసంగి పంట సీజన్లలో నిర్దేశించిన పంట రుణాలను సాధించడంలో బ్యాంకర్లు వెనుకబడి ఉన్నారు. ఇప్పటినుంచి పంట రుణాలను లక్ష్యం మేరకు అందించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలి. నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు విద్యా రుణాలు, సొంత ఇంటిని నిర్మించుకునేందుకు గృహనిర్మాణ రుణాలు అత్యధికంగా అందించాలి. ముద్ర రుణాలు, స్ట్రీట్ వెండర్స్ రుణాలను నిర్దేశిత లక్ష్యం మేరకు అందించాలి. "

-కూరాకుల స్వర్ణలత, జిల్లా సంయుక్త కలెక్టర్

ఇదీ చూడండి:హోంమంత్రిని కలిసిన పంజాబ్​ జైళ్ల శాఖ మంత్రి సుఖ్​జిందర్

ABOUT THE AUTHOR

...view details