జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి క్లబ్ హౌస్లో బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డితో కలిసి ప్రభుత్వ రుణాలపై సమీక్షించారు. స్కీముల వారీగా రుణాల మంజూరుపై ఎల్డీఎం శ్రీనివాస్ వివరించారు.
సకాలంలో అందించాలి...
పేదల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక ఆర్థిక రుణ పథకాలను ప్రవేశపెట్టిందని కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ తెలిపారు. వాటిని జిల్లా పరిధిలోని లబ్ధిదారులకు సకాలంలో అందించాలన్నారు. ప్రజల ఆర్థిక ప్రగతికి ప్రతి బ్యాంకర్ ఆర్థిక సైనికులుగా పని చేయాలని స్పష్టం చేశారు. బ్యాంకర్లు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయడం వలన వివిధ రకాల రుణాలను సకాలంలో అందించగలిగామని పేర్కొన్నారు.
వారికి కూడా త్వరగానే...
డీఆర్డీఏ దారా లక్ష్యానికి మించి 114 శాతం రుణాలను మహిళా సంఘాలకు అందించినట్లు వెల్లడించారు. యువతకు స్వయం ఉపాధి రుణాలను, వీధి వ్యాపారులకు స్ట్రీట్ వెండర్స్ రుణాలను, రైతులకు పంట రుణాలను త్వరగా అందించాలని బ్యాంకర్లను కోరారు.