సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న యాత్ర భూపాలపల్లికి చేరుకుంది. భాజపా శ్రేణులు సంజయ్‌కు ఘన స్వాగతం పలికారు. స్థానిక అంబేడ్కర్ కూడలి వద్ద శాలువాప్పి పూలమాలతో సన్మానించారు. అనంతరం వివిధ సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయాలని డిమాండ్ చేశారు.
బండి సంజయ్‌కు ఘన స్వాగతం పలికిన భాజపా శ్రేణులు - Bandi Sanjay yatra reached to jayashankar bhupalpally district
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తూ.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన యాత్ర భూపాలపల్లికి చేరింది. ఆయనకు ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు.. శాలువాకప్పి, పూలమాలతో సన్మానించారు.
![బండి సంజయ్‌కు ఘన స్వాగతం పలికిన భాజపా శ్రేణులు Bandi Sanjay yatra reached to jayashankar bhupalpally district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8733554-959-8733554-1599625688937.jpg)
బండి సంజయ్‌కు ఘన స్వాగతం పలికిన భాజపా శ్రేణులు
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కేసీఆర్... ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కీర్తి రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కన్నం యుగేందర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:రియల్ జోరున్న చోట కొత్త సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులు