యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవ్వాలంటే వ్యాయామం తప్పనిసరని జయశంకర్ భూపాలపల్లి ఆర్డీవో శ్రీనివాస్ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్కార్యక్రమంలో భాగంగా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడం రన్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి స్టేడియం వరకు ఫ్రీడం రన్ నిర్వహించారు.
'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను విజయవంతం చేయాలి' - జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో ఫ్రీడం రన్
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని జయశంకర్ భూపాలపల్లి ఆర్టీవో శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలో యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడం రన్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను విజయవంతం చేయాలి'
స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని మోదీ తలపెట్టిన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి యువజన, క్రీడల శాఖ అధికారి బుర్ర సునీత ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.